![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -325 లో.. మనల్ని కావ్య ఇలా తప్పుగా అర్థం చేసుకోవడం నాకు ఇష్టం లేదని శ్వేత అనగానే.. నువ్వు తన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావని రాజ్ అంటాడు. అసలు నువ్వు ఆలోచిస్తున్నావా?నా లాగా కావ్య జీవితం అవ్వకూడదు.. నీకు నా భర్తకి ఏం తేడా లేదు.. వాడు తెలిసేలా, నువ్వు తెలియకుండా కాపురాలు చెడగొట్టుకుంటున్నారని రాజ్ తో శ్వేత అంటుంది.
ఆ తర్వాత నేను ఇప్పుడు వెళ్లి ఈ అపార్థాలన్ని తొలగిస్తాను అని శ్వేత వెళ్తుంటే రాజ్ వద్దని ఆపుతాడు. ఆ తర్వాత కావ్య కోపంగా కళ్యాణ్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. వీళ్ళు సరసాలలో తెలిపోతున్నారంటూ కావ్య పూర్తిగా రాజ్, శ్వేతలని అపార్ధం చేసుకొని కళ్యాణ్ కి చెప్తుంది. కావ్య కోపంలో వయిలెంట్ గా మాట్లాడుతుంటే కళ్యాణ్ కి భయమేస్తుంది. ఆ తర్వాత రాజ్ శ్వేతని చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తుంటాడు. నా కాపురంలో సమస్య వస్తే నువ్వు సాల్వ్ చేస్తున్నావ్.. నీ కాపురం లో సమస్య లు వస్తే నేను సాల్వ్ చేయకూడదా అని శ్వేత అంటుంది. అప్పుడే వస్తున్న కావ్యని రాజ్ చూసి.. కావాలనే శ్వేతపై చెయ్యి వేసి మాట్లాడుతు పంపిస్తాడు. కావ్యకి ఇంకా కోపం వస్తుంది. ఆ తర్వాత అప్పుని మా అబ్బాయి ఎక్కడో చూసి ఇష్టపడ్డాడంట అని తల్లి కొడుకులు కనకం ఇంటికి వచ్చి మాట్లాడతారు. మాకు మీ గురించి తెలుసు.. అప్పు గురించి కూడా తెలుసు. ఎవరినో ప్రేమించింది అతనికి పెళ్లి అయిపొయిందని కూడా తెలుసంటూ అప్పుపై చాలా ఇష్టంతో మాట్లాడుతుంటే కనకం వాళ్ళు సరే అంటారు. అప్పుడే అప్పు వస్తుంది. ఏం జరుగుతుందంటు కోపంగా మాట్లాడేసరికి.. అప్పుని కనకం గదిలోకి తీసుకొని వెళ్లి మాట్లాడుతుంది. నాకు ఇప్పుడు పెళ్లి వద్దని కనకానికి, ఆ పెళ్లిచూపులకి వచ్చిన వాళ్ళకి అప్పు చెప్తుంది.
ఆ తర్వాత అప్పు నిర్ణయం మార్చుకుంటే కాల్ చెయ్యండి అంటు వాళ్ళు వెళ్ళిపోతారు. కాసేపటికి ఎందుకు వద్దని అంటున్నావని అప్పుని కనకం అడుగుతుంది. నేను పోలీస్ అవ్వాలనుకుంటున్నానని అప్పు చెప్పి వెళ్ళిపోతుంది. కనకం కృష్ణమూర్తి ఆశ్చర్యంగా చూస్తారు. మరొకవైపు కావ్య కార్ కి అడ్డుగా శ్వేత భర్త కార్ పెడతాడు. నిన్ను నీ భర్త.. నన్ను నా భార్య మోసం చేసారు. వాళ్ళు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని శ్వేత భర్త అనగానే కావ్య అతనిని తిడుతుంది. భార్య అలా చేస్తుంటే ఏం చేస్తున్నావంటూ అతనిని తిడుతుంది. తరువాయి భాగంలో కావ్య, రాజ్ ఇద్దరు ఎప్పటిలాగే మాటలతో యుద్ధం చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |